Shri. Devineni Uma Maheswararao

chandra
Nara-Lokesh-2-removebg-preview
achena

Our Leader's Schedule

Press Releases

Loading Events

బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి …..

ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి

ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణా పై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ.

ఇంటి వద్ద ఉమాను అడ్డుకున్న పోలీసులు. మమ్మల్ని నిరసన తెలుపకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ పోలీసులను ప్రశ్నించిన ఉమా.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ ల బూడిద దోపిడీని ఎండగడతామన్న భయంతో పోలీసులతో అడ్డుకుంటున్నారు.

బూడిద అక్రమ రవాణాను ఆపాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన దేవినేని ఉమా.

బూడిద అక్రమ రవాణా తో మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ గుండెకాయ నాసిరకం బొగ్గు సరఫరాతో అటువంటి ధర్మల్ పవర్ స్టేషన్ మూతపడే పరిస్థితికి తీసుకొచ్చారు.

జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసే బొగ్గులో 20 నుంచి 30% రాళ్లు ఇసుక నాసిరకం బొగ్గు.

గతంలో యాజమాన్యం ప్రోక్లైన్ తో లోడింగ్ ఫ్రీగా ఉండేది.

వైసిపి నాయకులు మాఫియా ఫ్రీ లోడింగ్ కు పెట్టాల్సిన జెసిబి ప్రోక్లైన్లు పెట్టకుండా వీళ్ళ సొంత మిషన్లు పెట్టుకుని రోజుకు కోటి సంపాదిస్తున్నారు.

దీంట్లో తాడేపల్లి కొంపకు ఎన్ని కోట్లు వెళుతున్నాయి కోట్ల రూపాయల బూడిద దోపిడీలో వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ భాగస్వాములు.

53 నెలల్లో ఎన్ని కోట్లు తిన్నారు తింటే తిన్నారు మా ఆరోగ్యాలు మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోసాని కోటేశ్వరావు అడ్డం పెట్టుకొని ఎంత దోచుకుంటున్నాడు.

ఇది మాట్లాడే మేము పశువులం కాదు మనుషులం పశువుల ఇంజక్షన్ నీకు చేయాలి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.

కానిస్టేబుల్ గోపి బూడిదపడి చావు బతుకుల్లో గొల్లపూడి ఆంధ్ర హాస్పటల్లో ఉన్నాడు.